: మీ తరువాత వచ్చా, మాజీ అయిపోయా... సచిన్ టెండూల్కర్ నిర్వేదం!
వారు ముగ్గురూ భారతరత్నాలే. అయితే, ఆ 'పురస్కారం' మాత్రం ఇద్దరికి అధికారికంగా వచ్చేసింది. మరొకరికి ఒకటి, రెండేళ్లలో వచ్చే సూచనలున్నాయి. అలాంటి ఆ రత్నాల ఫోటో ఒకేచోట కనిపిస్తే... వారెవరంటే ఇద్దరు భారతరత్న అవార్డు గ్రహీతలు లతామంగేష్కర్, సచిన్ టెండూల్కర్, మూడోవ్యక్తి అమితాబ్ బచ్చన్. ఈ ఫోటోపై అమితాబ్ ట్వీట్ చేయగా, సచిన్ కాస్తంత నిరాశను ప్రదర్శించాడు. అసలు విషయానికి వెళితే... అహ్మదాబాద్ లో ఓ గోడపై ఈ ముగ్గురూ కలిసున్న ఓ సందర్భంలోని పోస్టర్ ను చూసిన అమితాబ్, ఆ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ, ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య ఉన్నానని ట్వీట్ చేశారు. దీన్ని చూసిన సచిన్, ముగ్గురిలో తానే మొదట మాజీని అయిపోయానని అన్నారు. వీరి ట్వీట్స్ ఆన్ లైన్లో లైకుల మీద లైక్ లు, షేర్లతో దూసుకుపోతుండగా, వీరు ముగ్గురూ గొప్పవారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.