: ఉత్తరాదిని కమ్మేసిన పొగ మంచు... రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం


ఉత్తర భారతంపై మంచు దుప్పటి పరుచుకుపోయింది. క్రమంగా తగ్గిపోయిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో నిన్న రాత్రి దేశవ్యాప్తంగా చలి పులి ప్రతాపం చూపింది. నేటి ఉదయం సూర్యుడు బయటకు వచ్చినా, మంచు దుప్పటి మాత్రం కనుమరుగు కాలేదు. ఉత్తర భారతంలో ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొంగమంచు ఆవరించేసింది. ఫలితంగా 80కి పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విమానాల రాకపోకలను కూడా పొగమంచు ప్రభావితం చేసేసింది. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విమానాలు టేకాఫ్ తీసుకోవడం లేదు. అత్యవసరమనుకున్న విమానాల ల్యాండింగ్ కు మాత్రం ఎయిర్ పోర్టు అధికారులు అనుమతి ఇస్తున్నారు. ఇక నగర వీధుల్లో 5 మీటర్ల దూరంలో లైట్లు వేసుకుని వస్తున్న వాహనాలు కూడా కనిపించడం లేదు. ఉత్తర భారతంలోని అన్ని జాతీయ రహదారులపైనా ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఆయా హైవేలపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకే భయపడిపోతున్నారు.

  • Loading...

More Telugu News