: ఒబామా, క్లింటన్, ట్రంప్, హిల్లరీల మాస్కులతో ర్యాంప్ పై మెరిసిన వయ్యారిభామలు!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ లు ఫ్రాన్స్ రాజధాని అందాల నగరమైన పారిస్ లో ర్యాంప్ పై తళుక్కుమన్నారు. వీరంతా పారిస్ ఎప్పుడెళ్లారా? అని ఆశ్చర్యపోకండి. వెళ్లింది వారు కాదు, ర్యాంప్ పై వాస్తవంగా తళుక్కుమన్నది కూడా వారు కాదు. వారి మాస్కులు ధరించిన అందగత్తెలు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో పారిస్ లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆ దేశానికి చెందిన పలువురు ప్రముఖుల మాస్కులు, వినూత్నమై దుస్తులు ధరించిన మోడళ్లు ర్యాంప్ వాక్ చేశారు. ఈ ర్యాంప్ వాక్ ఆహూతులను ఎంతో ఆకట్టుకుంది.