: 88 ఏళ్ల ప్రియురాలితో 93 ఏళ్ల ప్రియుడ్ని కలిపేందుకు నెటిజన్ల విరాళం


88 ఏళ్ల ప్రియురాలితో 93 ఏళ్ల ప్రియుడ్ని కలిపేందుకు నెటిజన్లు 7 వేల డాలర్లు విరాళంగా ఇచ్చారు. రెండో ప్రపంచయుద్ధం కాలంలో అమెరికా సైన్యంలో పనిచేసిన థామస్ ఇంగ్లండ్ వెళ్లాడు. అక్కడ 18 ఏళ్ల జాయిసీని కలుసుకున్నాడు. వారి పరిచయం పెరిగింది. ఇంతలో థామస్ అమెరికా వెళ్లిపోయాడు. అనంతరం జాయిసీని కలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ కుదర్లేదు. ఇంటర్నెట్ ప్రభావం పెరిగిపోవడంతో జాయిసీ ఆస్ట్రేలియాలో ఉంటున్నట్టు తెలుసుకున్నాడు. దీంతో స్కైప్ లో ఆమెతో సంభాషించాడు. అయితే ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉన్న థామస్ ఆమెను కలుసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తూ గడిపేశాడు. అతని గురించి తెలుసుకున్న నెటిజన్లు ఉదారంగా స్పందించి 7 వేల డాలర్లు విరాళంగా అందజేశారు. థామస్ ప్రేమ కథను విన్న విమానయాన సంస్థ అతనికి, అతనితో పాటు సహాయకుడుగా ఆస్ట్రేలియా వెళ్లే వ్యక్తికి ఉచితంగా టికెట్లు అందజేస్తామని తెలిపింది. దీంతో థామస్ త్వరలో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడు. డెబ్భై ఏళ్ల క్రితం ముగిసిన ప్రేమ కథకు 93 ఏళ్ల వయసులో ప్రాణం పోయనున్నాడు.

  • Loading...

More Telugu News