: నిజామాబాద్ లో గల్ఫ్ ఏజెంట్ మోసం!


తెలంగాణలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా, నిజామాబాద్ లో ఒక గల్ఫ్ ఏజెంట్ మోసం వెలుగు చూసింది. నకిలీ వీసాలతో 70 మందికి టోకరా ఇచ్చిన ఈ నిందితుడి పేరు దుండిగల్ భూమేష్. గల్ఫ్ కు పంపుతానంటూ ఇక్కడి యువకుల నుంచి సుమారు రూ.కోటి వసూలు చేసుకున్నాడు. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆగ్రహించిన బాధితులు నిందితుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News