: ప్రాక్టీస్ చేస్తుండగా బంగ్లాదేశ్ క్రికెటర్ తలకు గాయం!
అండర్-19 వరల్డ్ కప్ కు బంగ్లాదేశ్ క్రికెటర్లు ఈరోజు ప్రాక్టీసు చేస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. క్రికెటర్ సాలెహ్ అహ్మద్ షావోస్ గాజీ తలకు గాయమైంది. ఈ విషయాన్ని అండర్-19 విభాగం కోచ్ మిజానూర్ రెహ్మాన్ ధ్రువీకరించారు. ఆటగాళ్లు ప్రాక్టీసు చేస్తుండగా ఈ సంఘటన జరిగిందన్నారు. స్పిన్నర్ షావోన్ బౌలింగ్ చేసి రిటర్న్ క్యాచ్ అందుకుంటున్న సందర్భంలో తలకు బంతి బలంగా తగిలినట్లు చెప్పారు. ఆసుపత్రికి తరలించి వెంటనే చికిత్స చేయించామని, షావోన్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెడికల్ ఆఫీసర్ బాడువా పేర్కొన్నారు.