: దేశభక్తికి నిదర్శనం... కోటీశ్వరుడు సైన్యంలో పని చేస్తున్నాడు!


కోటి రూపాయలు ఉంటే దానిని ఎలా పెద్దది చేయాలా? అని చూస్తారు...భద్రత సమస్యగా మారితే 'కోట్ల డబ్బు ఉంది కదా, వేరే దేశంలో స్థిరపడిపోదాం' అని ఆలోచించే ప్రస్తుత తరుణంలో దేశ రక్షణ కోసం ఓ కోటీశ్వరుడు సైనికుడైన ఘటన ఇరాక్ లో చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...ఇరాక్ లోని టెలికాం దిగ్గజం సిర్వాన్ బర్జానీ కోటీశ్వరుడు. దేశ వ్యాప్తంగా ఆయనకు చెందిన సిర్వాన్ టెలికాం సంస్థకు 3500 సెల్ టవర్లు ఉన్నాయి. ఆయన ఇరాక్ లోని కుర్థిస్థాన్ అధ్యక్షుడికి స్వయానా మేనల్లుడు. 2014లో కుర్దిస్థాన్ రాజధాని ఎర్ బిల్ సమీపంలోకి ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు చొచ్చుకువచ్చారు. వారిని నిలువరించేందుకు మాజీ గెరిల్లా యోధులను సైన్యంలో చేరాల్సిందిగా అధ్యక్షుడు మహ్మద్ బర్జానీ పిలుపునిచ్చారు. దీంతో సిర్వాన్ బర్జానీ కుర్దు సైనికుడిగా రంగంలోకి దిగారు. తరువాత ఐఎస్ఐఎస్ తో పోరాడి వారిని ఎర్ బిల్ లో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. తమకు సరైన ఆయుధాలు ఉంటే ఐఎస్ఐఎస్ ను మోసూల్ పట్టణం నుంచి కూడా తరిమేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News