: దత్తన్న లేఖతోనే సస్పెన్షన్లు...ఏబీవీపీ వేధింపులతోనే రోహిత్ సూసైడ్: హెచ్ సీయూలో కేజ్రీ కామెంట్స్


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వర్సిటీలో విద్యార్థులు చేపట్టిన దీక్షలకు సంఘీభావం ప్రకటించేందుకు నేటి ఉదయం హైదరాబాదు వచ్చిన కేజ్రీ కొద్దిసేపటి క్రితం సెంట్రల్ వర్సీటీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లేఖ కారణంగానే రోహిత్ సహా ఐదుగురు విద్యార్థులపై వర్సిటీ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారని ఆయన ఆరోపించారు. అంతేకాక ఏబీవీపీ వేధింపుల కారణంగానే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని కూడా కేజ్రీ వాదించారు. ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ పై అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు అసలు దాడే చేయలేదని కూడా ఆయన అన్నారు. జరిగిన ఘటనను పక్కదారి పట్టించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News