: ఓట్లేస్తే... రూ.22 లక్షలిస్తా: గ్రామం మొత్తానికి హర్యానా మంత్రి బంపరాఫర్


దేశంలో ఓటుకు నోటు... విషయం కొత్తదేమీ కాకున్నా, నిన్న వెలుగుచూసిన ఓ ఘటనలో హర్యానాకు చెందిన ఓ మంత్రివర్యుడు ఏకంగా ఓ గ్రామాన్నే కోనేసేందుకు యత్నించారు. తమ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే, మరుక్షణమే గ్రామాభివృద్ధికి రూ.22 లక్షల నిధులు మంజూరు చేస్తానని ఆ మంత్రి హామీ ఇచ్చి సీక్రెట్ కెమెరాకు అడ్డంగా బుక్కయ్యారు. దీంతో హర్యానాలోనే కాక కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ చిక్కుల్లో పడింది. హర్యానా గనుల శాఖ మంత్రి నాయబ్ సైనీ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఓ గ్రామానికి వెళ్లారు. గ్రామంలోని మొత్తం ఓట్లన్నీ తమ అభ్యర్థికే వేయాలని ఓటర్లను కోరారు. అంతటితో ఆగని ఆయన ఓట్లేసిన మరుక్షణమే గ్రామానికి రూ. 22 లక్షల నిధులు మంజూరు చేయిస్తానని ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఓ వ్యక్తి మంత్రి గారి ప్రసంగాన్నంతటినీ రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టేశారు.

  • Loading...

More Telugu News