: 'డేటా వాడకంపై ఒక్కో టెల్కో ఒక్కోలా వసూళ్ల'పై కదిలిన ట్రాయ్!
ఇండియాలో సెల్ ఫోన్ సేవలందిస్తున్న టెలికం కంపెనీలు, డేటా వాడకంపై వేర్వేరు ధరలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తుండటంపై ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) కదిలింది. నెట్ న్యూట్రాలిటీపై చర్చ జరుగుతున్న వేళ, డేటా సేవల ప్రైసింగ్ విధానాన్ని ఒక తాటిపైకి తేవాలన్న లక్ష్యంతో నేడు బహిరంగ చర్చకు పిలుపునిచ్చింది. టెల్కోలు మాత్రం డేటా సేవలకు వసూలు చేయాల్సిన మొత్తం ఎంతన్నది తన నిర్ణయానికే వదిలేయాలని డిమాండ్ చేస్తుండగా, నెట్ న్యూట్రాలిటీ కార్యకర్తలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. డేటా ధరల్లో తేడా వల్ల కస్టమర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నెట్ ట్రాఫిక్ ను సమానంగా పంచాలని ఏ కంపెనీ, టెల్కోలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండరాదన్నది నెట్ న్యూట్రాలిటీ ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే యూఎస్, చీలీ, నెదర్లాండ్స్, బ్రెజిల్ వంటి దేశాలు దీన్ని చట్టబద్ధం చేశాయి. ఇండియాలో దీనిపై పెను చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.