: బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సులేట్ కి బెదిరింపు లేఖ... కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు


భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే గణతంత్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పోలీసులు భద్రత పెంచారు. గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఆ దేశ కాన్సులేట్ కార్యాలయానికి ఓ బెదిరింపు లేఖ వచ్చిన విషయం నేటి ఉదయం వెలుగు చూసింది. ఈ నెల 14ననే వచ్చిన సదరు లేఖపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కూడా ప్రారంభించారు. విచారణలో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నై నుంచి సదరు లేఖను గుర్తు తెలియని వ్యక్తులు పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

  • Loading...

More Telugu News