: ఇక్కడ ఖైదీలే వంటవాళ్లు.. రుచి అదుర్స్.. ధర సరసం


కేరళలోని తిరువనంతపురంలో పుజప్పురా సెంట్రల్ జైలు సమీపంలో ఫుడ్ ఫర్ ఫ్రీడమ్ కేఫ్ పేరిట ఒక రెస్టారెంట్ ను ఏర్పాటుచేశారు. ఈ రెస్టారెంట్ లో సుమారు 15 మంది ఖైదీలు వండి వడ్డిస్తుంటారు. అన్నిరకాల పదార్థాలను రుచికరంగా తయారుచేసి అందుబాటు ధరల్లో అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. ఖైదీలకు ఉపాధి కల్పించేందుకు జైలు అధికారులు ఈ ఏర్పాటు చేశారు. కాఫీ, టీ, టిఫిన్, బిర్యానీ మొదలైనవన్నీ ఇక్కడ తయారుచేస్తారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకూ తెరచి ఉండే ఈ రెస్టారెంట్ లో అతి తక్కు ధరకే ఆహార పదార్థాలను అందిస్తారు. కాగా, నలుగురు జైలు సిబ్బంది ఈ రెస్టారెంట్ ను పర్యవేక్షిస్తుంటారని సంబంధిత అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News