: బ్యాంకు దోపిడీకి విఫల యత్నం.. దుండగుని చేయి నరికేసిన గ్రామస్తులు
బ్యాంకు దోపిడీకి వచ్చి, గ్రామస్తుల చేతికి చిక్కిన ఒక దుండగుని చేతిని నరికేసిన ఘటన బీహార్ లోని మహువా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలోకి ప్రవేశించిన నలుగురు దుండగులు బ్యాంక్ ఆఫ్ బరోడా లోకి ప్రవేశించి రూ. 2.5 లక్షలు దోచుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. ఇంతలో గ్రామస్తులు వారిని వెంబడించగా వారి చేతికి ఒక దుండగుడు చిక్కాడు. దీంతో వారు అతన్ని తీవ్రంగా కొట్టడంతో పాటు, అతని చేతిని నరికేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ దుండగుణ్ని తమ అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.