: పైలట్ కు నచ్చలేదని విమానంలోంచి వాళ్లను దించేశారు!


పైలట్ కు నచ్చలేదన్న కారణంగా నలుగురు ప్రయాణికులను విమానంలోంచి దించేసిన ఘటన చోటుచేసుకుంది. అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టొరొంటో నుంచి న్యూయార్క్ కు వెళ్లాల్సి ఉంది. ఇంతలో బంగ్లాదేశ్ కు చెందిన ఓ సిక్కు ప్రయాణికుడు, తన స్నేహితుడైన అరబ్ ముస్లిం వద్ద కూర్చోవాలని అతని సహ ప్రయాణికుడ్ని రిక్వెస్టు చేసి, సీటు మార్పించుకున్నాడు. అతని పక్కన మరో ఇద్దరు ముస్లింలు కూర్చుని ఉన్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఎయిర్ హోస్టెస్ నలుగురినీ ఫ్లయిట్ దిగమని సూచించింది. ఎందుకు? అని వారు ప్రశ్నించడంతో మర్యాదగా ఫ్లయిట్ దిగి, గేట్ దగ్గర వెయిట్ చేస్తే ఏం చేయాలో సిబ్బంది చెబుతారని దురుసుగా సమాధానం ఇచ్చింది. దీంతో చేసేది లేక వారు దిగిపోయారు. వారి జాతి, రంగు పైలట్ కి నచ్చేలేదని వారిని దించేసినట్టు సమాచారం. ఈ పరిణామంతో తమను విమాన సిబ్బంది తీవ్రంగా అవమానించారంటూ నలుగురూ కలిసి అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థపై 9 మిలియన్ డాలర్లకు కోర్టులో కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News