: కిండర్ గార్టెన్ విద్యార్థులను సూదులతో గుచ్చిన ఉపాధ్యాయులు!


క్రమశిక్షణ పేరిట కిండర్ గార్టెన్ విద్యార్థులను ఉపాధ్యాయులు సూదులతోగుచ్చిన దారుణ సంఘటన చైనాలో జరిగింది. జిలిన్ రాష్ట్రంలోని సైపింగ్ నగరంలో ఒక పాఠశాల ఉంది. సుమారు 20 మంది కిండర్ గార్టెన్ చిన్నారుల శరీరంపై టీచర్లు సూదులు గుచ్చుతున్నారు. దీంతో బాలల శరీరంపై ఎర్రటి సూది గుర్తులు పడ్డాయి. వీటిని చూసిన చిన్నారుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల తీరుపై మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. కాగా, ఒక చిన్నారి శరీరంపై 50 సూది పోట్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక వెల్లడించడం గమనార్హం.

  • Loading...

More Telugu News