: మహిళలు, చిన్నారులను వదిలి...పెద్దలు, టీనేజర్లను ఉంచుకున్న ఐఎస్ఐఎస్
సిరియాలోని ఎజ్జోర్ పట్టణంపై దాడి చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వందలాది మందిని ఊచకోతకోసి, 400 మందిని అపహరించిన సంగతి తెలిసిందే. వారిలో 270 మందిని నేడు ఐఎస్ఐఎస్ విడుదల చేసింది. వారిలో మహిళలు, 14 ఏళ్ల లోపు చిన్నారులు ఉన్నట్టు సిరియన్ మానవహక్కుల పరిశీనా వేదిక అధ్యక్షుడు రామి అబ్దెల్ రహమాన్ తెలిపారు. ఇంకా ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల చెరలో 130 మంది ఉన్నట్టు ఆయన వెల్లడించారు. వారిలో పెద్దలు, టీనేజర్లు ఉన్నట్టు ఆయన చెప్పారు. బందీలుగా చేసుకున్న వారిని ప్రశ్నించిన ఐఎస్ఐఎస్ జీహాదీలు వారిని విడుదల చేస్తూ, ఎజ్జోర్ పట్టణంలో ప్రవేశించకూడదని హెచ్చరించారని ఆయన తెలిపారు.