: విద్యార్థుల తలల్లో కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఈ ఉదయం పాకిస్థాన్ వాయవ్య ప్రాంతంలోని చార్ సద్దాలో ఉన్న బచా ఖాన్ వర్శిటీపై దాడి చేసిన ఉగ్రవాదులు విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. పలువురు విద్యార్థుల తలల్లోకి ముష్కరులు కాల్పులు జరిపారని పాకిస్థాన్ మీడియా బ్రేకింగ్ కథనాలు ఇస్తోంది. ఘటన గురించి తెలుసుకున్న ఆర్మీ, పోలీసులు వర్శిటీని చుట్టుముట్టారని పాక్ డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ రాయ్ టర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య పోరాటం కొనసాగుతోందని, ఎంతమంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న విషయం తెలియదని ఆయన తెలిపారు. కాల్పుల్లో గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని వివరించారు. వీరిలో అత్యధికుల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య 20 దాటవచ్చని అంచనా. ఈ ఉగ్రదాడిపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.