: వరంగల్ ఎంపీగా పసునూరి ఎన్నికపై సర్వే పిటిషన్


తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లోక్ సభకు జరిగిన ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నిక ప్రమాణ పత్రంలో పసునూరి దయాకర్ తప్పుడు సమాచారం ఇచ్చారని, ఎల్పీజీ పంపిణీదారుగా ఉన్న భార్యను గృహిణిగా పేర్కొన్నారని సర్వే తెలిపారు. కాబట్టి ఎంపీగా ఆయన ఎన్నికను చెల్లదని ప్రకటించాలని హైకోర్టును కోరారు. గతేడాది జరిగిన వరంగల్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానం నుంచి పసునూరి రికార్డు మెజారిటీతో గెలుపొందారు.

  • Loading...

More Telugu News