: రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్త ఆందోళనలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ప్రధాన నగరాల్లో విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి జోక్యం చేసుకోవడంవల్లే పరిస్థితి ఇలా మారిందని వారు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు, చెన్నైలో ఐఐటి విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. బెంగళూరులో ఏఐఎస్ఏ ధర్నా నిర్వహించింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ పాలనలో మతతత్వ శక్తులు చెలరేగుతున్నాయని, దళితులకు ఉరితాళ్లు, విషం సీసాలే దిక్కవుతున్నాయనే నినాదాలతో ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు.