: అమరావతిని ప్రపంచంలోనే జీవయోగ్య నగరంగా నిర్మిస్తున్నాం: దావోస్ లో చంద్రబాబు ప్రకటన
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 46వ సదస్సుకు హాజరయ్యేందుకు స్విట్జర్లాండ్ నగరం దావోస్ కు వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం కార్యరంగంలోకి దిగేశారు. అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన చంద్రబాబు నవ్యాంధ్రలో పెట్టుబడులకు ఉన్న అనుకూలాంశాలను వారి ముందు పెట్టారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచంలోనే జీవయోగ్య నగరంగా తీర్చిదిద్దనున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలోనే అగ్రశ్రేణి నగరంగా రూపుదిద్దుకోనున్న అమరావతిలో తమ సంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆయన వారిని కోరారు.