: నడికుడి వద్ద నిలిచిపోయిన పల్నాడు ఎక్స్ ప్రెస్!
వికారాబాద్-గుంటూరు వెళ్లే పల్నాడు ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నడికుడి గ్రామం వద్ద నిలిచిపోయింది. సుమారు గంటన్నర నుంచి ఈ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పల్నాడు ఎక్స్ ప్రెస్ అర్థాంతరంగా ఆగిపోవడంతో గుంటూరు నుంచి లింక్ ట్రెయిన్లను అందుకోవాల్సిన ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతి లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తిందని, మరమ్మతు పనులు చేపట్టామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రతిరోజూ ఉదయం 5.45 గంటలకు పల్నాడు ఎక్స్ ప్రెస్ గుంటూరు నుంచి బయలుదేరుతుంది.