: ఆ ఊరు ఎంతోమంది 'ఐఏఎస్'లకు పుట్టిల్లు!


అది చూసేందుకు ఓ కుగ్రామం... నిండా వంద ఇళ్లు కూడా లేని ఆ గ్రామం దేశానికి ఎంతో సేవ చేసింది. అదే మధ్యప్రదేశ్ లోని మధోపట్టి గ్రామం! ఆ ఊళ్లో కేవలం 75 కుటుంబాలు మాత్రమే వున్నాయి. ఆ గ్రామానికి చెందిన ముస్తఫా హుస్సేన్ అనే వ్యక్తి 1914లో తొలిసారి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ర్యాంకు సాధించి, పీసీఎస్ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్పూర్తిగా సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసిన ఇందూ ప్రకాశ్ రెండో ర్యాంకు సాధించారు. ఇక అప్పటి నుంచి ఆ గ్రామంలో యువకులు వారిద్దరి స్పూర్తితో ఉన్నత శిఖరాలు అధిరోహించడం మొదలుపెట్టారు. ఇలా ఆ గ్రామం నుంచి ఇప్పటి వరకు 47 మంది ఐఏఎస్ ఆఫీసర్లుగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఆ ఊరికి చెందిన ఎంతో మంది విద్యార్థులు, ఇస్రో, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ప్రపంచ బ్యాంకుల్లో ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ గ్రామాన్ని యూపీలో ఐఏఎస్ గ్రామం అంటారు. ఇంత మంది ఐఏఎస్ లు, ఉన్నత పదవుల్లో వ్యక్తులు ఉన్నప్పటికీ ఆ గ్రామానికి సరైన రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు లేకపోవడం శోచనీయం.

  • Loading...

More Telugu News