: జర్నలిస్టు జేడే హత్య కేసులో ఛోటా రాజన్ ను ప్రశ్నించేందుకు అనుమతి


గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులకు అనుమతి లభించింది. ఈ నెల 27 నుంచి పది రోజుల పాటు అతన్ని ప్రశ్నించడానికి ప్రత్యేక కోర్టు అనుమతి తెలిపింది. అంతకుముందుకు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న ఛోటాను లైవ్ వీడియో ద్వారా ప్రత్యేక కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. 2011లో జరిగిన పాత్రికేయుడు జేడే హత్య కేసుతో అతనికి సంబంధం ఉందని, ఈ నేపథ్యంలో ప్రశ్నించేందుకు అనుమతించాలని కోర్టును సీబీఐ కోరింది. ఆ విజ్ఞప్తిపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి ఏఎల్ పన్సారే అంగీకరిస్తున్నట్టు చెప్పారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News