: ప్రస్తుతానికి ఏపీలో నాటు సారా ఉంది... ఏడాదిలో రూపుమాపుతాం: కొల్లు రవీంద్ర


ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాటు సారా ప్రజలకు అందుబాటులోనే ఉందని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. సారాను అడ్డుకోవాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందని, వచ్చే ఏడాదిలోగా పూర్తిగా సారాను నియంత్రిస్తామని ఆయన అన్నారు. ఏపీలో మొత్తం 19,202 అక్రమ సారా తయారీ కేంద్రాలను గుర్తించామని వెల్లడించిన ఆయన, వాటన్నింటినీ ధ్వంసం చేయాలని, మరో ప్రాంతంలో కేంద్రాలు ఏర్పాటు చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. బెజవాడ కల్తీ మద్యం కేసులో కేంద్ర ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి వుందని, ఆపైనే చర్యలు తీసుకోగలుగుతామని రవీంద్ర వెల్లడించారు.

  • Loading...

More Telugu News