: పెళ్లి చేసుకోగానే విషం చిమ్ముతావా... క్షమించను!: కుమార్తె పూజా బేడీకి కబీర్ బేడీ వార్నింగ్
తాను ఎంతో ఆనందంతో వివాహం చేసుకుంటే, ఆనందానికి అడ్డుపడుతూ విషం చిమ్ముతోందని కుమార్తె పూజా బేడీపై, ఏడు పదుల వయసులో వివాహం చేసుకున్న కబీర్ బేడీ నిప్పులు చెరిగాడు. తన తండ్రిని వివాహం చేసుకున్న పర్వీన్ దుసాంజే, తన జీవితంలోకి వచ్చిన దెయ్యమని నిన్న పూజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో పూజా స్పందనకు, అంతే కోపంతో కబీర్ బేడీ సమాధానం ఇచ్చాడు. "నా భార్య పర్వీన్ పట్ల నా కూతురు విషం చిమ్మడంతో తీవ్రంగా బాధపడుతున్నా. పెళ్లి చేసుకోగానే ఇలా మాట్లాడటం తగదు. ఈ చెడు ప్రవర్తనను క్షమించలేను" అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టాడు.