: ఇంగ్లీష్ రాకుంటే దేశబహిష్కరణే: ముస్లిం మహిళలకు బ్రిటన్ హెచ్చరిక


బ్రిటన్ లో ఉంటూ ఇంగ్లీష్ భాషను స్పష్టంగా మాట్లాడలేని వారిని దేశం నుంచి బయటకు పంపిస్తామని ఆ దేశ ప్రధాని డేవిడ్ కెమెరాన్ హెచ్చరించారు. ముఖ్యంగా ముస్లిం మహిళలు ఆంగ్ల భాష తక్షణం నేర్చుకోవాలని అన్నారు. సరైన భాషా నైపుణ్యం లేకుంటే ఐఎస్ఐఎస్ తరహా ఉగ్రవాదులన్న అనుమానం వస్తుందని, వారిని మరింతగా అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. 20 మిలియన్ పౌండ్ల భాషా నిధిని ఏర్పాటు చేసిన సందర్భంగా జరిగి ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఎవరైనా తమ భార్యలను బ్రిటన్ తీసుకురాదలిస్తే, వారి భాషా నైపుణ్యాన్ని సైతం పరిశీలిస్తున్నామని, ఈ దిశగా ఇమిగ్రేషన్ నిబంధనలను మార్చామని డేవిడ్ గుర్తు చేశారు. భాషా నైపుణ్యాన్ని మెరుగుపరచుకోకుంటే, దేశంలో ఉంటారన్న గ్యారంటీని ఇవ్వలేమని అన్నారు. కాగా, బ్రిటన్ లో 1.9 లక్షల మంది ముస్లిం మహిళలు ఉండగా, వారిలో 22 శాతం మందికి ఆంగ్లంపై ఎంతమాత్రమూ పరిజ్ఞానం లేదని గణాంకాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News