: తొలిసారి వేశ్య పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటి!
బాలీవుడ్ నటి దివ్యాదత్త తొలిసారి వేశ్య పాత్రలో నటించనుంది. ఈ పాత్ర పోషించడంపై ఆమె మాట్లాడుతూ, ఇటువంటి పాత్రలో నటించాలన్న ఆసక్తి తనకు ఎప్పటినుంచో ఉందని చెప్పింది. ఈ తరహా పాత్ర తన ముందుకు ఎప్పుడూ రాలేదని దివ్యాదత్త పేర్కొంది. అరూప్ దత్తా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ మార్చిలో ప్రారంభంకానుంది. కోల్ కతాలోని రెడ్ లైట్ ప్రాంతంలోనే షూటింగ్ జరుగుతుందని ఆమె చెప్పింది. కాగా, 'చాక్ ఎన్ డస్టర్' చిత్రంలో నెగెటివ్ పాత్రలో నటించిన దివ్యాదత్తా వేశ్య పాత్రలో ఏ విధంగా నటిస్తుందనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.