: రైలింజన్ నుంచి విడిపోయిన బోగీలు!
రైలింజన్ నుంచి బోగీలు విడిపోయిన సంఘటన ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. గ్యాన్ పూర్ స్టేషన్ మాస్టర్ అశోక్ కుమార్ కథనం ప్రకారం, ఉదయం 9.10 గంటల సమయంలో ఢిల్లీ నుంచి మరువాదీకి వెళుతున్న 'శివగంగా ఎక్స్ ప్రెస్' రైలింజన్ నుంచి బోగీలు జంగీగంజ్, అత్రౌలా రైల్వేస్టేషన్ మధ్య విడిపోయాయి. రైలు తక్కువ వేగంతో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగిందని, లేకుంటే పెద్ద ప్రమాదం సంభవించి ఉండేదని స్టేషన్ మాస్టర్ పేర్కొన్నారు. ఈ సంఘటన కారణంగా ఆ మార్గంలో నడవాల్సిన సుమారు ఆరు రైళ్లను నిలిపివేశారు. మరో రైలు ఇంజన్ ద్వారా ఉదయం 10.34 గంటల సమయంలో విడిపోయిన బోగీలను అక్కడి నుంచి గమ్యస్థానానికి తరలించారు.