: బ్రహ్మణి స్టీల్స్ కు ఎదురుదెబ్బ


ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో ప్రస్తుతం జైలులో ఉన్న గాలి జనార్థనరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. గాలికి చెందిన బ్రహ్మణి స్టీల్స్ కు కడప జిల్లాలో కేటాయించిన 10,700 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నేడు నిర్ణయించింది. జమ్మలమడుగు వద్ద ఈ భూమి కేటాయింపును రద్దు చేస్తూ, సర్కారు తాజాగా జీవో జారీ చేసింది. నిర్ధిష్ట గడువులోగా కంపెనీని ప్రారంభించకపోవడంతోనే రద్దు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News