: ఢిల్లీకి తాకిన హెచ్సీయూ సెగ..వాటర్ కెనన్లు, బాష్పవాయుగోళాలు సిద్ధం!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్ డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య సంఘటన సెగ ఢిల్లీకి తాకింది. రోహిత్ ఆత్మహత్యపై విచారణకు గాను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ద్విసభ్యకమిటీని ఏర్పాటు చేశారు. ఈ బృందాన్ని హైదరాబాద్ కు పంపారు. ఈ సంఘటనపై విచారణ అనంతరం ఇందుకు సంబంధించిన నివేదికను ద్విసభ్యకమిటీ కేంద్రానికి రేపు సమర్పించనుంది. కాగా, హెచ్ఆర్డీ కార్యాలయం వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వాటర్ కెనన్లు, బాష్పవాయుగోళాలను పోలీసులు సిద్ధం చేశారు. వర్శిటీలో జరిగిన సంఘటనలకు నిరసనగా విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు.