: వరుసగా 13వ నెలలోనూ బేజారైన భారత్ ఎక్స్ పోర్ట్స్
ఇండియా నుంచి ఎగుమతులు గణనీయంగా దిగజారాయి. వరుసగా 13వ నెలలోనూ కుంచించుకుపోయాయి. సోమవారం నాడు విడుదలైన గణాంకాల ప్రకారం, గడచిన డిసెంబరులో ఎగుమతులు 2014తో పోలిస్తే 14.75 శాతం తగ్గాయి. ఈ నెలలో ఎగుమతులు 22.29 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 3.88 శాతం తగ్గి 33.96 బిలియన్ డాలర్లకు చేరాయి. దాదాపు సంవత్సరం క్రితం 2014 నవంబరులో ఎగుమతులు పెరిగిన తరువాత, ఇంతవరకూ వృద్ధి నమోదు కాలేదు. గడచిన నవంబర్ లో ఏకంగా 24 శాతం దిగజారి 20 బిలియన్ డాలర్లకు పడిపోయిన ఎగుమతుల విలువ, 2013 నవంబరులో 26 బిలియన్ డాలర్ల వద్ద కొనసాగిన సంగతి తెలిసిందే. ఇదో పెద్ద పతనమని, అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదలతోనే గణాంకాలు కుంచించుకుపోతున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు.