: సిరియాలో ఐఎస్ఐఎస్ నరమేధం, 300 మంది ఊచకోత


సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత హేయంగా తెగబడి మారణహోమం సృష్టించారు. దెర్ ఏజోర్ నగరంపై విరుచుకుపడ్డ ముష్కర మూక కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చుతూ, తలలు నరుకుతూ తెగబడ్డారు. 300 మందిని దారుణంగా చంపిన ఉగ్రవాదులు మరో 400 మందిని బందీలుగా పట్టుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఉగ్రవాదుల చేతుల్లోని దెర్ ఏజోర్ నగరం వెళ్లకుండా సిరియా సైన్యాలు, మిలీషియా సభ్యులు తీవ్రంగా పోరాడుతుండగా, నగర కేంద్రం వరకూ ఉగ్రవాదులు చేరినట్టు సమాచారం. నగరంలో ఎటుచూసినా భీకర పోరు దృశ్యాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. పౌరుల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో తొలుత ఆందోళనపడ్డ ఉగ్రవాదులు, ఆపై ఉన్మాదులుగా మారి, రోజంతా విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ, వారిని నిర్దయగా హత్యలు చేస్తూ సాగడంతో మృతుల సంఖ్య వందల్లోకి చేరింది. దీంతో నగరం మొత్తం శవాల గుట్టగా మారినట్టు ఓ అధికారి తెలిపారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నరమేధంపై మరింత సమాచారం వెలువడాల్సివుంది.

  • Loading...

More Telugu News