: 1100 క్యారెట్ల వజ్రాలు, 43,800 ముత్యాలు, కిలో బంగారంతో తయారైన ఏడు వరుసల నక్లెస్ ఇదే!


అది 2004... జైపూర్ లో మున్నూ కస్లీవాల్ నిర్వహిస్తున్న ఆభరణాల దుకాణం. మధ్య ప్రాచ్య దేశాల్లోని ఓ రాజకుటుంబంలో జరిగే వివాహం కోసం అత్యంత ఖరీదైన నక్లెస్ కావాలని ఆర్డర్ వచ్చింది. అది ఓ 'సత్లాద' (ఏడు వరుసల నక్లెస్), దీంతో పాటు హెడ్ డ్రస్, దానికి నప్పేలా చెవి రింగులు కావాలని వచ్చిన ఆర్డర్ ను కస్లీవాల్ సీరియస్ గా తీసుకున్నారు. 1,100 క్యారెట్ల వజ్రాలను, 43,800 ముత్యాలను, కిలోకు పైగా బంగారాన్ని వినియోగించి, 75 మంది పనివాళ్లతో దాదాపు మూడేళ్ల పాటు శ్రమించి తయారు చేసి 2007లో డెలివరీ ఇచ్చారు. ఇప్పుడు అదే ఆభరణం ముంబైకి మరోసారి వచ్చింది. ఆభరణాల వ్యాపారాన్ని విస్తరించుకునే దిశగా ముంబైలో కొత్త స్టోర్ ను ప్రారంభించిన మున్నూ కస్లీవాల్ కుమారుడు సిద్ధార్థ, క్రెమ్లిన్ మ్యూజియంలో ఉన్న ఈ నక్లెస్ సెట్ ను ఓ ప్రత్యేక విమానంలో తెప్పించి ప్రదర్శనకు ఉంచాడు. దీని బరువు 4 కిలోలని, సాధ్యమైనంత తక్కువ బరువు ఉంచేలా చూసేందుకు తన తండ్రి ఎంతో శ్రమించారని ఈ సందర్భంగా సిద్ధార్థ వ్యాఖ్యానించారు. ఆ నక్లెస్ చిత్రాన్ని మీరూ చూడండి.

  • Loading...

More Telugu News