: ఎయిర్ ఫోర్స్ అధికారిని ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరి అరెస్టు
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఎయిర్ ఫోర్స్ అధికారులు జనవరి 13న రిహార్సల్స్ చేస్తుండగా, ఆడి కారుపై వచ్చిన తృణముల్ కాంగ్రెస్ నేత కుమారుడు సాంబియా సోహ్రబ్ ఎయిర్ ఫోర్స్ అధికారి అభిమన్యు గౌడ్ (21)ను ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. పూటుగా తాగి కారునడిపి పరారైన సాంబియా సోహ్రబ్ సెల్ ఫోన్ సిగ్నల్స్ అధారంగా నిన్న సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి సాంబియా స్నేహితుడు సోనూను నేటి ఉదయం బెంగాల్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరో ప్రత్యక్ష సాక్షిని ఇంకా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. సాంబియా బెయిల్ కు దరఖాస్తు చేయగా, న్యాయస్థానం తిరస్కరించింది.