: 'ఓ దయ్యం మారు తల్లిగా వచ్చింది'... కబీర్ బేడీ వివాహంపై పూజా బేడీ స్పందన!
ఏడు పదుల వయసులో తన దీర్ఘకాల స్నేహితురాలు పర్వీన్ దుసాంజ్ ను కబీర్ బేడీ వివాహం చేసుకోవడంపై ఆయన కుమార్తె పూజా బేడీ తీవ్రంగా స్పందించింది. కబీర్ కు, డ్యాన్సర్ ప్రొతిమాకు పూజా జన్మించిన సంగతి తెలిసిందే. "ప్రతి కథలో ఓ క్షుద్రశక్తి లేదా ఓ దయ్యం ఉంటుంది. నా కథలో దయ్యం సవతి తల్లి రూపంలో ఇప్పుడే వచ్చింది" అని ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టింది. కాగా, కబీర్ వివాహం 15న జరిగిన సంగతి తెలిసిందే. ప్రొతిమా నుంచి విడిపోయిన తరువాత కబీర్ కు ఇది మూడవ వివాహం. ప్రొతిమా తరువాత ఫ్యాషన్ డిజైనర్ సుసాన్ ను, ఆపై టీవీ యాంకర్ నిక్కీ బేడీని ఆయన వివాహం చేసుకున్నాడు.