: కేజ్రీవాల్ 'సరి.. బేసి' నిబంధన హాస్యాస్పదం: అక్షయ్ కుమార్


ఢిల్లీలో ఇటీవల ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాలుష్యం, ట్రాఫిక్ నియంత్రణకు ప్రవేశపెట్టిన 'సరి- బేసి' నిబంధన హాస్యాస్పదమంటూ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అక్షయ్ నటిస్తున్న 'ఎయిర్ లిఫ్ట్' సినిమాలో ఈ నిబంధనపై ఒక పారడీ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో కేజ్రీవాల్ మొదలుకొని గాయకుడు అద్నాన్ సమీ వరకూ పలువురిపై హాస్యోక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇటీవల విడుదల చేసిన క్లిప్పింగ్ లో అక్షయ్ ఆర్టీవోకు ఫోన్ చేసి, ట్రాఫిక్ గురించి అడుగుతుంటాడు. ఈ విధానం వలన ఢిల్లీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News