: రాహుల్ చాలా అమాయకుడు... హేమమాలిని


మధుర పార్లమెంటు సభ్యురాలు, సినీ నటి హేమమాలిని రాహుల్ గాంధీ చాలా అమాయకుడంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ జీఎస్టీ బిల్లను అడ్డుకుంటున్నారని, నిజానికి ఈ బిల్లు దేశానికి మంచి చేస్తుందని అన్నారు. ఆయన ఈ విధంగా వ్యవహరించడం చూస్తుంటే చాలా అమాయకుడనిపిస్తోందన్నారు. ఈ బిల్లు అమలులోకి వస్తే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశానికి మంచి చేయాలనుకుంటుంటే రాహుల్ ఇలా అడ్డుపడటం తగదని హితవు పలికారు.

  • Loading...

More Telugu News