: బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన నితీశ్ కుమార్
బీజేపీపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగే ప్రతి నేరాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని నితీశ్ మండిపడ్డారు. 'దేశంలోను, దేశం బయట నేరాలు జరుగుతుంటాయి. అయితే ప్రతి దానికి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు' అని ఆయన రాష్ట్ర బీజేపీకి హితవు పలికారు. ప్రతిపక్షాలు రాష్ట్రంలో ఏం జరిగినా దానిని రాజకీయం చేయాలని చూస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అయినదానికి కానిదానికి ప్రజలు ఆందోళన పడేలా మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పద్ధతి సరికాదని, ప్రతిపక్షాలు ప్రవర్తన మార్చుకోవాలని ఆయన సూచించారు.