: ఢిల్లీలోని వెంకయ్యనాయుడు నివాసంలో సంక్రాంతి వేడుకలు... గాయకుడు బాలూకి ఘన సత్కారం


ఢిల్లీలోని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎన్వీ రమణ, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రోహిణి, పలువురు ఎంపీలు, బీజేపీ నేతలు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను వెంకయ్యనాయుడు ప్రధాని సమక్షంలో సత్కరించారు. 40 వేలకుపైగా పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం వర్థమాన గాయకులకు రోల్ మోడల్ గా నిలిచారని ఆయన చెప్పారు. దక్షిణాది ప్రజలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించుకునే సంక్రాంతి వేడుకల గొప్పతనాన్ని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News