: ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా...ఆసక్తికరంగా సాగుతున్న మ్యాచ్


ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే ఆసక్తికరంగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 295 పరుగులు చేయగా, 296 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ను చక్కని బంతితో ఆరోన్ ఫించ్ (21) ను బోల్తా కొట్టించి ఉమేష్ యాదవ్ దెబ్బ కొట్టాడు. అనంతరం క్రీజులో కుదురుకున్న స్టీవ్ స్మిత్ (41) ను అద్భుతమైన బంతితో రవీంద్ర జడేజా పెవిలియన్ బాటపట్టించగా, ధోనీ చేసిన అద్భుతమైన స్టంప్ కు జార్జ్ బెయిలీ (23) అవుటయ్యాడు. అనంతరం షాన్ మార్ష్ (62) ను ఇషాంత్ శర్మ అవుట్ చేయగా, ఉమేష్ యాదవ్ విసిరిన త్రోను ఒడిసి పట్టుకున్న ధోనీ కన్నుమూసి తెరిచేంతలో స్టంప్స్ ను గిరాటేసి మిచెల్ మార్ష్ ను పెవిలియన్ చేర్చాడు. దీంతో ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 36 ఓవర్లలో 208 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్ (35), మాధ్యూవేడ్ (1) క్రీజులో ఉన్నారు. కాగా, టీమిండియా బౌలర్లలో జడేజా రెండు, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ చెరోవికెట్ తీసి రాణించారు.

  • Loading...

More Telugu News