: తొలి వికెట్ పడింది... 21 పరుగులకు ఫించ్ అవుట్
296 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 7వ ఓవర్లో తొలి వికెట్ ను కోల్పోయింది. 23 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేసిన ఏజే ఫించ్, ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ దారి పట్టాడు. మరో ఓపెనర్ షాన్ మార్షి 20 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 25 పరుగులు చేసి ఊపుమీద ఉండగా, వన్ డౌన్ లో స్టీవెన్ స్మిత్ వచ్చి చేరాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 52 పరుగులు. మరో 42 ఓవర్లలో 244 పరుగులు చేస్తే, రెండు మ్యాచ్ లు మిగిలుండగానే ఈ సిరీస్ ను ఆస్ట్రేలియా గెలుచుకున్నట్టవుతుంది.