: కిటకిటలాడుతున్న తిరుమల... గజగజ వణుకుతున్న భక్తులు


సంక్రాంతి సెలవులు ముగియనున్న వేళ, తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 28 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, నడకదారి భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న శనివారం నాడు 89,127 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు తిరుమలపై కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో, చలికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడికి నేడు చందన అలంకారోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News