: 269 స్టోర్లు మూసేయనున్న అమెరికా రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్


అమెరికా రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ 269 స్టోర్లు మూసేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వాల్ మార్ట్ సీఈవో డ్యూగ్ మెక్ మిల్లర్ మాట్లాడుతూ, అమెరికా, లాటిన్ అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో లాభదాయకంగా లేని వాల్ మార్ట్ స్టోర్లను మూసేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇది తమ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. వాల్ మార్ట్ రిలైట్ వ్యాపార రంగం నుంచి ఈ-కామర్స్ రంగం వైపు దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో సిబ్బందికి వేతనాలు భారీగా పెంచి, శిక్షణ కూడా ఇప్పిస్తోంది. ఈ మొత్తం మార్పుకు బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని వాల్ మార్ట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో లాభసాటి కాని స్టోర్లను మూసేసి, ఈ కామర్స్ ను బలోపేతం చేయాలని భావిస్తోంది.

  • Loading...

More Telugu News