: భారత్ లో స్టార్టప్ ఆలస్యానికి కారణం నేనే: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
భారతదేశంలో స్టార్టప్ ఇండియా (అంకుర భారత్) ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. మేకిన్ ఇండియా నినాదంతో స్టార్టప్ కంపెనీల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. దీంతో అంతర్జాతీయంగా భారత్ లో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమనే వాదన వినిపిస్తోంది. అయితే భారత్ లో ఈ పరిస్థితి ఎప్పుడో ప్రారంభం కావాల్సిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. భారత్ లో పారిశ్రామిక వృద్ధి ఎప్పుడో ప్రారంభంకావాల్సి ఉందని, చాలా ఆలస్యమైందని ఆయన చెప్పారు. ఈ ఆలస్యానికి కారణం తానేనని ఆయన వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వంలో తాను ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో తాను వెనుకబడ్డానని ఆయన తెలిపారు. స్టార్టప్ ఇండియా కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని ఆయన తెలిపారు.