: ప్రకాశం జిల్లాలో కల్తీ మద్యం?... వైన్ షాప్ ఎదుటే వ్యక్తి మృతి
విజయవాడలో కల్తీ మద్యం కేసు దర్యాప్తు ముగియనే లేదు, అప్పుడే ప్రకాశం జిల్లాలో మరో కల్తీ మద్యం ఘటన నమోదైంది. జిల్లాలోని కందుకూరులోని అమరావతి వైన్స్ లో మద్యం కొనుగోలు చేసిన కొండయ్య అనే వ్యక్తి సదరు మద్యం సేవించిన అనంతరం వైన్ షాప్ ఎదుటే కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. వైన్ షాప్ లో కొన్న కల్తీ మద్యం కారణంగానే కొండయ్య చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ప్రకాశం జిల్లా ఎక్సైజ్ శాఖ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనకు దారి తీసిన కారణాలను వెలికితీసే పనిలో పడ్దారు.