: 90-60... గ్రేటర్ బరిలో టీడీపీ, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి టీడీపీ, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహన కుదిరింది. దఫదఫాలుగా జరిగిన చర్చల్లో భాగంగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య సీట్ల సర్దుబాటుపై ఓ అంగీకారం కుదిరింది. గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లున్నాయి. మొత్తం అన్ని డివిజన్లలోనూ పోటీ చేయాలని ఈ కూటమి తీర్మానించింది. 90 డివిజన్లలో టీడీపీ పోటీ చేయనుండగా, 60 సీట్లలో బీజేపీ తన అభ్యర్థులను నిలపనుంది. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదిరిన నేపథ్యంలో నేడు టీడీపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.