: రోడ్డు ప్రమాదం నుండి బయటపడిన గంగూలి భార్య
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భార్య డోనా గంగూలీ రోడ్డు ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ ఘటన కోల్ కతాలోని బెహార్ చౌరస్తాలో చోటుచేసుకుంది. గంగూలీ భార్య ప్రయాణిస్తున్న కారును వెనుకనుండి వచ్చిన ఒక ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గంగూలీ భార్యకు పెద్దగా దెబ్బలు తగలలేదు. కానీ కారు స్వల్పంగా దెబ్బతిన్నట్టు పోలీసులు చెబుతున్నారు. డోనా తమ కుమార్తెను స్కూలు నుండి తీసుకురావడానికి వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.