: కోస్తాంధ్రలో కోడి పందాలు, రాయలసీమలో ఎడ్లబండ్ల పందాలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతోంది. ముత్యాలముగ్గులు, కబడ్డీ ఆటలు, పిండివంటలు, ప్రత్యేక కార్యక్రమాలు, పంటపొలాలు, కాల్వగట్లలో కుటుంబం, బంధుమిత్రులతో కలిసి ఊసులాడుకుంటూ స్వచ్ఛమైన పల్లెల అందాలు వీక్షిస్తూ ప్రజలు సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలోని ఉభయగోదారి జిల్లాలతో పాటు రాజధాని రెండు జిల్లాలలో కూడా కోడి పందాలు జోరందుకున్నాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోనూ కోడిపందాలు జరుగుతుండగా, మరి కొన్ని ప్రాంతాలలో ఎడ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. ఎడ్ల సత్తా నిరూపించుకునేందుకు రైతులు పోటీ పడుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతంలో చూసినా సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News