: తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారలేదు: జూనియర్ ఎన్టీఆర్


తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారలేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. 'నాన్నకు ప్రేమతో' ప్రమోషన్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు సినీ ప్రేక్షకులు ఒకే జానర్ సినిమాలను పెద్దగా ఆదరించరని పేర్కొన్నాడు. సినీ పరిశ్రమ ఆది నుంచి కథా ప్రాధాన్యమున్న సినిమాలే ఆదరణ పొందుతున్నాయని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. అందుకు ఇటీవలి నిదర్శనమే 'శ్రీమంతుడు', 'భలేభలే మగాడివోయ్' సినిమాలని ఆయన తెలిపాడు. ఆ కోవలోదే 'నాన్నకు ప్రేమతో' అని పేర్కొన్నాడు. ఈ సినిమాలో జానర్ కథలను అనుసరించలేదని, సరికొత్త కథను చెప్పే ప్రయత్నం చేశామని ఆయన వివరించాడు. ఈ సినిమాను అభిమానులు ఆదరిస్తున్నారని, సుకుమార్ కథ, ఆలోచనలపై తనకు నమ్మకం ఉందని జూనియర్ ఎన్టీఆర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. తొలి నాళ్లలో తాతగారు చేసిన పౌరాణిక, సాంఘిక సినిమాలను ఆదరించి విభిన్నత చాటుకున్నట్టే ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు.

  • Loading...

More Telugu News