: జైలులో మహిళా ఖైదీ గర్భందాల్చిన కేసులో వెలుగు చూసిన సంచలన విషయం


జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీ గర్భం దాల్చిన కేసు దర్యాప్తులో అధికారులకు విస్మయపరిచే వాస్తవాలు వెలుగుచూసిన ఘటన బీహార్ లో కలకలం రేపుతోంది. ఉత్తర బీహార్ లో కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ సంతోష్ షా గ్యాంగ్ లో షార్ప్ షూటర్ అయిన ముఖేష్ పాఠక్, దర్బాంగ ఇంజనీర్ల హత్యకేసులో ప్రధాన నిందితుడు. ఈ కేసులో షివోహర్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీలుగా ముఖేష్ పాఠక్, అతని భార్య పూజాకుమారి కొంత కాలం శిక్ష అనుభవించారు. తర్వాత ముఖేష్ పాఠక్ జైలు నుంచి పారిపోయి, ప్రస్తుతం నేపాల్ లో తలదాచుకుంటున్నాడని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంచితే, జైలులో ఉన్న భార్య పూజాకుమార్ గర్భం దాల్చారు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఎలా గర్భం దాల్చింది? అంటూ అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. ఆమె శిక్ష అనుభవిస్తున్నా సంసారానికి ఎలాంటి ఇబ్బంది రాలేదని ఆధికారులు తెలుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముఖేష్ పాఠక్ గతంలో పురుషుల బ్యారక్స్ లో ఉన్నప్పుడు, జైలు అధికారులు, సిబ్బందికి తాయిలాలు అందజేసి, కావాలనుకున్నప్పుడు పూజాకుమారిని కలిసేవాడని తేలింది. వీరి కలయికకు ఏర్పాట్లు చేసేది అసిస్టెంట్ జైలర్ అని తేలింది. ఆయన గదిలోనే ఈ భార్యాభర్తలిద్దరూ కాపురం చేసేవారని అధికారులు కనుగొన్నారు. ఆ కారణంగా ఆమె గర్భందాల్చినట్టు అధికారులు తేల్చారు. ఈ దర్యాప్తును షివోహర్ జిల్లా మేజిస్ట్రేట్, ముజఫర్ పూర్ సెంట్రల్ జైలు సూపరిండెంట్ నిర్వహించడం విశేషం.

  • Loading...

More Telugu News